Warangalvoice

మంత్రులను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ


వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ గురువారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,
పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్యతో కలిసి మంత్రుల  నివాసంలో ఆయనను కలిసిన స్వర్ణ మంతులకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రులు ఆమెకు సూచించారు. పార్టీ అప్పగించిన ఈ కీలక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా మహిళలను చైతన్యపరచడంలో స్వర్ణ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్, సీనియర్ నాయకులు నల్గొండ రమేష్, తోట హరీష్,పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *