Warangalvoice

గ్రామ అభివృద్ధిలో సిబ్బంది కీలక పాత్ర

వరంగల్ వాయిస్,శాయంపేట : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సింహులపల్లి గ్రామపంచాయతీ సిబ్బందిని బుధవారం రోజున ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బందికి గ్రామ ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి తిరుపతి  మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ శుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వారి కృషి ప్రశంసనీయమని అన్నారు. వారి సేవలను గుర్తిస్తూ సన్మానించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగరాజు,ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు రాజు,రజిత, శ్రీకాంత్,రహీమున్నిసా,లత తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *