Warangalvoice

ఒగ్లాపూర్ గురుకులాల్లో తహశీల్దార్ ఆకస్మిక తనిఖీ


వరంగల్ వాయిస్, దామెర: మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ, మహాత్మ జ్యోతిబాపూలే, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలను తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో అందుతున్న వసతులు, భోజన సౌకర్యాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ పాఠశాలలోని కిచెన్ షెడ్లను సందర్శించి, విద్యార్థులకు వాడుతున్న కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి, పారిశుధ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, భోజన నాణ్యతలో నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గురుకులాల్లో విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంట జీపీఓ హరిప్రసాద్, ఇతర సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *