
- దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
- రూ.4.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
వరంగల్ వాయిస్, వరంగల్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంగళవారం వరంగల్ (తూర్పు) నియోజక వర్గ పరిధిలోని 32,41 డివిజన్ లలో రూ.4.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ లు, సైడ్ వాల్ లు, బాక్స్ డ్రైన్ ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజక అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని గతంలో తాను శాసన సభ్యురాలుగా ఉన్నపుడు వేసిన రోడ్లు అని ప్రస్తుతం దెబ్బతిని పనికి రాకుండా పోయిన నేపథ్యంలో మేయర్, కమిషనర్ స్థానిక కార్పొరేటర్లు స్థానిక నాయకుల సహకారంతో ఏక్కడ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వారి అవసరం మేరకు అంచనాలు తయారు చేసి వరంగల్ తూర్పు నియోజక వర్గం లో ప్రతి డివిజన్ లలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని, హౌసింగ్ కు సంబంధించి అన్ని డివిజన్ లలో అర్హులైన వారికి ఎల్ 1 కింద ఇప్పటికే ఇండ్లు కేటాయించడం జరిగిందని, కొంతమంది ఇండ్లు రాలేదు అని అడుగుతున్నారని, రీ వెరిఫికేషన్ కింద మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని వారిని కోరడం జరిగిందని అన్నారు.
స్థలాలు ఉండి ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లను మంజూరు చేయడం, తమ వద్ద పెండింగ్ లో ఉన్నాయని అలాంటి వారికి సహకారం అందిస్తామని, స్థలం లేని వారికి రెండు పడక గదుల గృహాలు కేటాయిస్తామని ఇందుకోసం డబుల్ బెడ్రూం గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నామని దాని ప్రకారం 2200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వరంగల్ తూర్పు నియోజక వర్గం లో అందుబాటు లో ఉన్నాయని ల్, త్వరలో ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నారని, నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యు జీ డి), వరంగల్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం (ఐ డి ఓ సి)ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించనున్నామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న అన్ని పనులను మంజూరు చేయించుకుని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందని అన్నారు. రూ. 200 కోట్లతో నియోజక వర్గానికి రెసిడెన్షియల్ స్కూల్ ను కేటాయించారని, నియోజకవర్గంలో స్థల లభ్యత లేకపోవడం వల్ల వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి లో గల స్థలాని ఎన్ ఓ సి ద్వారా తీసుకోవడానికి కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చారని ఆది టెండర్ దశలో ఉందని దానిని కూడా ముఖ్యమంత్రి చేతులతో పునాది రాయి వేసేలా చూస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి ఆలోచన విధానం నిరుపేదల సంక్షేమమేనని , విద్యను ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్లడమే కాకుండా క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ అన్ని రంగాలలో ముందుకెళ్లడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 ను నిర్వహించి 2047 సం.వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధన లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశలో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని, ప్రజాపాలనను కొనసాగిస్తూ ఎటువంటి అవినీతికి తావు లేకుండా ముందుకు వెళ్తున్నామని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 15 వేలు త్వరలోనే చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి తహసిల్దార్ల నుండి జాబితా సిద్ధం ఐన తరువాత పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
ఈ నేపధ్యం లో 41 వ డివిజన్ పరిధి లోని నాగమయ్య గుడి ప్రాంతం లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లును మంత్రి క్షేత్ర స్థాయిలో సందర్శించారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం సందర్భం గా శివ నగర్, వాటర్ ట్యాంక్ ప్రాంతంలో నిర్మిస్తున్న డక్ట్ డ్రైన్ పనుల స్థితి గతుల క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి పనుల పురోగతిని మేయర్ కమిషనర్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కార్పొరేటర్లు పల్లం పద్మ రవి. పోశాల పద్మ స్వామి, భోగి సువర్ణ సురేష్, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, చింతాకుల అనిల్ కుమార్, డీఆర్ఓ విజయ లక్ష్మీ ఈఈ సంతోష్ బాబు, తహసిల్దార్ మహ్మద్ ఇక్బాల్, డీఈ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
