Warangalvoice

Women Journalists | మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్

  • Women Journalists | పల్స్‌ న్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ రేవతి, న్యూస్‌ రిపోర్టర్‌ బండి సంధ్య అలియాస్‌ తన్వీ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : పల్స్‌ న్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ రేవతి, న్యూస్‌ రిపోర్టర్‌ బండి సంధ్య అలియాస్‌ తన్వీ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. ఈ ఇద్ద‌రు మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌కు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. రూ. 25 వేల పూచీక‌త్తుతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్ర‌తి సోమ‌, శుక్ర‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆర్డ‌ర్ కాపీలు అందిన వెంట‌నే.. చంచ‌ల్‌గూడ జైలు నుంచి విడుద‌ల కానున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన ఓ రైతు వీడియోను పోస్ట్‌ చేయడమే పెద్ద నేరమైంది. ప్రజా సమస్యలను తమ చానల్‌ ద్వారా ప్రసారం చేయడమే కాంగ్రెస్‌ సర్కారుకు కంటగింపుగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అంటూ మహిళా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

గ‌త బుధ‌వారం తెల్లవారుజామున 4గంటలకే ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ‘పల్స్‌ న్యూస్‌ బ్రేక్‌’ చానల్‌ జర్నలిస్ట్‌ రేవతి ఇంటికి 18 మంది పోలీసులు చేరుకున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు జర్నలిస్ట్‌ రేవతిని అరెస్టు చేస్తున్నామంటూ తన ఫోన్‌తోపాటు ఆమె భర్త ఫోన్‌ను లాక్కున్నారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా ఓరైతు మాట్లాడిన వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్టు చేసినందుకు అరెస్టు చేస్తున్నట్టు ఆమెకు నోటీసు ఇచ్చారు. అదే సమయంలో కొత్తూరులో మరో మహిళా జర్నలిస్ట్‌ సంధ్య అలియాస్‌ తన్వీ యాదవ్‌ ఇంటికి పోలీసులు వెళ్లి ఆమెను కూడా అరెస్ట్‌ చేశారు. అరెస్టుల అనంత‌రం వీరిద్ద‌రిని 8గంటల పాటు రహస్యంగా విచారించారు.

Women Journalists Revathi And Tanvi Yadav Got Bail By Nampally Court
Women Journalists Revathi And Tanvi Yadav Got Bail By Nampally Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *