Warangalvoice

Warangal | జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు యువతులకు గాయాలు

వరంగల్ వాయిస్, వరంగల్ చౌరస్తా : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. శనివారం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఎం.కె.నాయుడు హోటల్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మంత్రి రాక కోసం కార్యక్రమాన్ని కొంత సమయం వేచి ఉంటారు. అలాగే ప్రారంభ కార్యక్రమం, మంత్రులు ప్రసంగించి వెళ్లే వరకు నిలిపివేయడంతో ఈ క్రమంలో భారీగా చేరుకున్న నిరుద్యోగ యువతముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.

దాంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ అద్దాలు పగిలిపోవడంతో ముగ్గురు యువతులకు గాయాల్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. కాగా, ఇరుకుగా ఉన్న హోటల్లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించడంపై పలువురు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Three Young Women Injured At Job Fair Held In Warangal
Three Young Women Injured At Job Fair Held In Warangal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *