Yennam Srinivas Reddy | మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు.
వరంగల్ వాయిస్, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు. ఇందులో భంగా మహబూబ్‌నగర్ విద్యానిధిని ఏర్పాటు చేశామని, సామాజిక స్పృహ కలిగిన వారు సహకరించాలన్నారు. పట్టణంలోని బీఈడీ కాలేజీలో నూతనంగా నిర్మించిన శౌచాలయాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలేజీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మన కళాశాలను, పాఠశాలలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ పేద విద్యార్థులు చదువుకుంటారని వారికి...
