Warangalvoice

Tag: With the arrest of Bandi Sanjay

బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు
Telangana

బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు

కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సజయ్‌ ను అర్ధరాత్రి అకారణంగా, అక్రమంగా అరెస్ట్‌ చేసి ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ… అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి అవినీతి, అక్రమాలు బయటపడకుండా ఆపలేరన్నారు. అయినా తమ పోరాటం ఆగదన్నారు. గతంలో తీన్మార్‌ మల్లన్న, అంతకు ముందు రఘు.. ఇలా ప్రశ్నించిన జర్నలిస్టులను కూడా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు లీకేజీలు, మరోవైపు ప్యాకేజీలు.. ఇది బయటపడకుండా ఉండడం కోసమే బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు లీకేజీ కారణంగా ఆగమయ్యాయని తెలిపారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం కోసమే బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేశారన్నారు. పార్లమెంట్‌ వే...