Telangana DGP | కొత్త డీజీపీ ఎంపిక.. యూపీఎస్సీకి 8 మందితో జాబితా.. చాన్స్ ఎవరికి దక్కేనో?
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్ ఎనిమిది మంది సీనియర్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇక నూతన డీజీపీ (Telangana DGP) ఎంపికపై దృష్టి సారిచింది. బుధవారంతో సీఎస్ శాంతి కుమారి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆమె స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసి...
