MLA KP Vivekananda | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
వరంగల్ వాయిస్, దుండిగల్ : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. ఇవాళ దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఛలో వరంగల్ సభ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఛలో వరంగల్ సభ విజయవంతంపై ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బంగారుమయంగా మార్చారని అన్నారు. స్వల్ప ఓటు...