MLA KP Vivekananda | రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన సందర్భంగా సంక్షేమ సంఘ సభ్యులు ఇవాళ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు.
వరంగల్ వాయిస్, దుండిగల్ : సంక్షేమ సంఘ సభ్యులు ఒక్క తాటిపై ఉంటేనే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్నీ డివిజన్లలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరిచామని.. రానున్న రోజుల్లో కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమ...