KCR | వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం.. బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు
KCR | తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : KCR | తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది. భేటీలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై నేతలతో కేసీఆర్ చర్చించి.. శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానాన్ని పార్టీ నేతలకు గుర్తు చేశారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన...