ఇడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం
బిఆర్‌ఎస్‌ను కూల్చే కుట్రలు ఫెయిల్‌తో నోటీసులు
తెలంగాణ బిడ్డలం వెరిచేది లేదన్న ఎమ్మెల్సీ కవిత
మోడీ పాలనా వైఫల్యాలపై ఘాటు విమర్శలు
వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను.. తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ బిడ్డనని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని అన్నారు. ఢల్లీిలో ఎమ్మెల్సీ కవిత విూడియాతో మాట్లాడారు. తాను విచారణకు సహకరిస్తాన్న కవిత ..ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్ సిట్ ముందుకు ఎందుకు రావడం లేదని ఎదురు ప్రశ్నించారు. సిట్ ముందుకు వచ్చేందుకు బీఎల్ సంతోష్‌కు భయమెందుకు..? అని కవిత ప్రశ్నించారు. బీజేపీ నేతలు, బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఉండవు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు పెడుతారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ...