Harish Rao | అసెంబ్లీని 20 రోజులు నడపాలని డిమాండ్ చేశాం : హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హరీశ్‌రావు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లుగా అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవడంపై అభ్యంతరం తెలిపామన్నారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్‌ను బల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామన్నారు. సంఖ్య బలాన్ని బట్టి బీఆర్ఎస్‌కు సభలో సమయం ఇవ్వాలని కోరామని.. తమ విజ్ఞప్తికి స్పీకర్ అంగీకరించారన్నారు. రైతాంగ ...