Warangalvoice

Tag: We have no relation to Chikoti Praveen

చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు
Crime, District News, Hanamkonda

చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు

భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ వరంగల్ వాయిస్, హనుమకొండ: క్యాసినో చికోటి ప్రవీణ్ తో తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నామని అతడికి తమకు ఎలాంటి సంబంధం లేదని భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం హన్మకొండ అమృత థియేటర్ పరిధిలోని భవితశ్రీ చిట్ ఫండ్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాసినో చికోటి ప్రవీణ్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని తమ సంస్థతో ఎలాంటి ఆర్థిక సంబంధం లేదన్నారు. వైశ్య సామాజిక వర్గం సమావేశంలో చికోటి ప్రవీణ్ పాల్గొన్నాడని, చిన జీయర్ స్వామితో చికోటి ప్రవీణ్ కు భక్తిపరమైన పరిచయం ఉందని అలా పేద వైశ్య కుటుంబాలకు చేయూతనందించడానికి ఆయనను సంప్రదించడం జరిగిందన్నారు. తమ సామాజిక వర్గం వాళ్ళని ఆధ్యాత్మిక సేవలో భాగంగా యాగంలో పాల్గొన్నప్పుడే ఆయన గురించి తెలిసిందన్నారు. తమ వాసవి బిజినెస్ గ్రూప్ ఆర్గనైజేషన్ సేవ సంస్థకు...