Kadem Project | కడెం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం.. ఆందోళనలో ఆయకట్టు రైతాంగం
Kadem Project | మార్చి మాసంలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు , చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 684 అడుగులు (4.237టీఎంసీల) వద్ద ఉంది.
వరంగల్ వాయిస్, కడెం : మార్చి మాసంలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 684 అడుగులు (4.237టీఎంసీల) వద్ద ఉంది. అయితే ఇప్పటికే నీటిమట్టం (Water level ) తగ్గడంతో ఆయకట్టు కింద సాగు చేసిన పంటలకు చివరి వరకు నీరు అందుతుందా అనేది ప్రశ్నర్ధాకంగా మారింది.
ఎస్సారెస్పీ( SRSP ) నుంచి కొన్ని రోజుల పాటు సరస్వతి కాలువ ద్వారా నచ్చన్‌ఎల్లాపూర్ మీదుగా కడెం ప్రాజెక్టులోకి నీటిని నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సదర్మాట్ ( Sadarmat ) కింద చ...