తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచుదాం
వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి
రెడ్ క్రాస్ లో పోలీసుల ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం
వరంగల్ వాయిస్, క్రైం: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి యువతకు పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు కోసం హన్మకొండ రెడ్ క్రాస్ పిలుపునందుకోని హనుమకొండ డివిజినల్ పోలీసుల ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో పాటు పోలీస్ సిబ్బంది, అధికారులు సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేయడంలో వారిని ప్రోత్సహించే విధంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ శిబిరం ముందుగా రక్తదానం చేసి యువతకు అదర్శంగా నిలిచారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రక్తదాతలకు సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ ...