నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి
వరంగల్ వాయిస్, క్రైం: నేరస్థులకు పట్టుకోనేందుకుగాను పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులకు సూచించారు. ఆర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా పోలీసు కమిషనర్ ముందుగా డ్రైవ్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలపై నేరాలు, మిస్సింగ్, ఎన్.డి.పి.ఎస్, చిట్ ఫండ్, రోడ్డు ప్రమాదాలు, ఈ. పెట్టి కేసులకు సంబంధించి గత ఏడాదికి , ఈ సంవత్సరంలో గడిచిన ఆరు నెలల కాలంలో జరిగిన కేసుల వ్యత్యాసాలపై సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి విశ్లేషించారు. అనంతరం ప్రస్తుతం నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్ , కేసుల దర్యాప్తు , రికవరీ,...