ఆరునూరైనా ఇక రాజధాని విశాఖే
చకచకా పనులు కానిస్తున్న అధికారులు
ఉగాది తరవాత మకాం మార్చే యోచన
వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: విశాఖలో సిఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ నుంచి పాలన చేసే అంశంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సిఎం ప్రకటించ నున్నారని సమాచారం. ఉగాది తర్వాత అక్కడ నుండే పరిపాలన జరగనుంది. దీనికోసం స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ పీఠాధిపతి స్వరూపానంద ఆశిస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పెట్టిన ముహూర్తానికి ఓకే చెప్పనున్నారని సమాచారం. సుప్రీం కోర్టు, హైకోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో పరిపాలనా రాజధానిపై పూర్తి స్థాయి ప్రకటన, స్పష్టత ఇవ్వకపోయినా సిఎంఒను మాత్రం విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రిషికొండ, భీమిలికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం విఐపి జోన్‌గా గుర్తించినట్లు తెలిసింది. రిషికొండపై ఏర్పాటు చేసే భవనాల్లోనే సిఎంఒ ఉండనుంది. దానికి ఆనుకుని ఉన్న నిర్మాణ...