ఇక జగన్‌కు విశాఖ ఉక్కు సెగ
రాజధానిని తరలిస్తే మరింత ఉధృతంగా పోరాటం
ఇక నిరంతరంగా పోరాటాలకు అవకాశం
వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: విశాఖకు రాజధానిని మారుస్తానని, త్వరలోనే తన నివాసం కూడా విశాఖే అని చెబుతున్న సిఎం జగన్ ఇక వివృాక ఉక్కు ఆందోళనలను ప్రత్యక్షంగా ఎదుర్కోక తప్పదు. ఆరునూరైనా విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మేస్తామన్న కేంద్రం ప్రకటనతో ఇప్పటికే విశాఖ ప్రజలు,కార్మిక సంఘాలు,రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కానివ్వబోం.. అంటూ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం కుండ బద్ధలు కొట్టేసింది. ఏ మాత్రం అనుమానాల్లేకుండా ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యమని ప్రకటించింది. ప్లాంట్ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్పింది. ఈ క్రమంలో జగన్ బస ఇక విశాఖకు మారితే ఉక్కు ఫ్యాక్టర...