Warangalvoice

Tag: Valla Ramana as State Convener of Journalist Housing and Welfare Committee

జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల రమణ
District News, Hanamkonda

జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల రమణ

వరంగల్ వాయిస్ (హన్మకొండ) : ఐజెయు అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రకటించారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన రమణ మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు. జర్నలిస్టు సంఘంలో గతంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులుగా, సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా, నాలుగుసార్లు ప్రధాన కార్యదర్శిగా, రాష్ర్ట కార్యవర్గ సభ్యులుగా, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా పనిచేసారు. వివిధ పత్రికల్లో, మీడియాలో పనిచేసిన రమణ ప్రస్తుతం మన తెలంగాణ దినపత్రిక ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్నారు. తనను రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం పట్ల మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి ర...