అవి ఇడి సమన్లు కాదు..మోడీ సమన్లు
వరుసగా మంత్రులు,నేతలపైనా దాడులు
తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను అస్థిర పరచే కుట్ర
విపక్షాలపైనే 90 శాతం దాడులు
దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న తీరు దారుణం
ఆదానీకి బినావిూగా మోడీ అన్నదే నిజం
డబుల్ ఇంజన్ అంటే మోడీ..ఆదానీ
ఆదానీ సంస్థల్లో అవినీతిపై నోరు మెదపని మోడీ
ఆదానీ పోర్టుల్లో డ్రగ్స్ దొరికినా చలనం లేదు
నిబంధనలకు విరుద్దంగా ఆదానికీ ఆరు ఎయిర్‌పోర్టులు
విూడియా సమావేశంలో మోడీని ఏకిపారేసిన కెటిఆర్
వరంగల్ వాయిస్, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు.. కచ్చితంగా మోదీ సమన్లని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరుసగా మంత్రుల విూదా ఇడి,ఐటి దాడులు చేయించారని అన్నారు. మా మంత్రి గంగుల విూద ఈడీ, సీబీఐ దాడులు చేయించారు. మల్లారెడ్డి విూద ఐటీ దాడులు చేయించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ ఇంటి విూద ఈడీ దాడి చేసి...