టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు
గులాబీకి కన్నెబోయిన రాజయ్య గుడ్ బైత్వరలోనే భవిష్యత్ కార్యాచరణ
వరంగల్ వాయిస్, హనుమకొండ: అధికార టీఆర్‌ఎస్ పార్టీ మరో షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచిన సీనియర్ నేత, షిప్ అండ్ గోట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆత్మగౌరవం లేని టీఆర్‌ఎస్ పార్టీలో ఉండలేకపోతున్నట్లు సీనియర్ నేత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్ల నుంచి సీఎం కేసీఆర్ తో కలిసి నడిచిన నేతగా రాజయ్య యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. నాటి ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరుగురు సీనియర్ నేతలతో కలిసి దీక్ష చేసిన నాయకుల్లో రాజయ్య ఒకరుగా నిలిచారు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్ట్ అయి ఖమ్మం జైలులో కేసీఆర్‌తో కలిసి ఉన్న నేతల్లో రాజయ్య యాదవ్ కూడా ఉన్నారు. రాజీమానామాపై విూడియాతో మాట్లాడిన రాజయ్య… టీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవం లేదన్నారు....