ధాన్యం కొనుగోళ్లలో వెనకడుగు లేదు
కేంద్రం సహకరించకున్నా ముందుకే
పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్
వరంగల్ వాయిస్,కరీంనగర్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం వల్లనే రైతులకు మేలు జరుగుతోందని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రం మొండికేసినా రాష్ట్రంలో చివరిగింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్రమంత్రి పేర్కొన్నారు. కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ ముందే రైతులకు సూచించారన్నారు. వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు విడిచిపెట్టలేదన్నారు. యాసంగి ధాన్యాన్ని నేరుగా కేంద్రమే కొనుగోలు చేయాలని అన్నారు. కేంద్రం ధాన్యం కొనకపోయినా గత కొన్నేళ్లుగా తామే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కేంద్రం...
