పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కాంగ్రెస్, బిజెపిలకు విమర్శలే లక్ష్యం
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
వరంగల్ వాయిస్,హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తున్నదని, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. బంగారు తెలంగాణకు భాగ్యనగరాన్ని మణిహారంలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల, అభివృద్ధి వికేంద్రీకరణ వంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ విపక్షాలకు ఎందుకు కానరావడం లేదన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నా, కాంగ్రెస్, బిజెపిలు విమర్శలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా డబుల్ ఇళ్లు పురోగతిలో ఉన్నాయని, అనేక చోట్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని, చాలామంది గృహ ప్రవేశాలు చేశారని అన్న...