ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్
వరంగల్ వాయిస్, హనుమకొండ : ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం, వసంతపూర్ గ్రామాల్లో ఓరుగల్లు డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుండగా శనివారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, తూకం వేసిన ధాన్యం తరలింపు, తదితర వివరాలతో పాటు తేమశాతం ఎంత తీస్తున్నారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ఎంత ధాన్యాన్ని తూకాలు వేయాల్సి ఉందని కలెక్టర్ ఆడిగారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల...