Warangalvoice

Tag: The biggest train accident of this decade

ఈ దశాబ్దపు అతిపెద్ద రైలు ప్రమాదం
Crime, District News, Latest News

ఈ దశాబ్దపు అతిపెద్ద రైలు ప్రమాదం

మూడు వందలకు పైగా మృతులు వేయికి పైగా క్షతగాత్రులు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని, సిఎం నవీన్‌ పట్నాయక్‌ మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ/బాలాసోర్‌ : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదమే ఈ దశాబ్ద కాలంలో జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైల్లు ఢీకొన్న ఘటనలో 300మందికి పైగా మృతి చెందగా, వేయికి పైగా క్షతగాత్రులయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి సమీపంలో పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొంది. ఈ ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్‌ రైలు బోగీలపై యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్‌పూర్‌ ఎక్స...