Warangalvoice

Tag: The arrival of the Governor to the Assembly after two years

రెండేళ్ల తరవాత అసెంబ్లీకి గవర్నర్‌ రాక
Telangana

రెండేళ్ల తరవాత అసెంబ్లీకి గవర్నర్‌ రాక

తమిళసైకి స్వయంగా స్వాగతం పలికిన కెసిఆర్‌ వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ :రెండేళ్ల తర్వాత గవర్నర్‌ తమిళిసై తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టారు. గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్‌ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ ఏడాది కూడా గవర్నర్‌ స్పీచ్‌ లేకుండానే సమావేశాలు నిర్వహించాలనుకున్నా చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్‌ ప్రసంగానికి ఓకే చెప్పింది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌ తమిళిసైకు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వాగతం పలికారు. శాసనసభ, మండలి సభ్యులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ గవర్నర్‌ ముందుకు కదిలారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమెను అనుసరించారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమకు కేటాయించిన...