Bhadrachalam | మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ధర్నా.. భద్రాచలం ప్రభుత్వ దవాఖాన వద్ద ఉద్రిక్తత
భద్రాచలం ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపేందర్ బంధువులు ఆందోళనకు దిగారు.
వరంగల్ వాయిస్, భద్రాచలం : భద్రాచలం ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపేందర్ బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మృతదేహాలకు పోస్టుమార్టం చేయాలని ప్రభుత్వ దవాఖాన మార్చురీ ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకున్నారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రా...
