యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
లేబర్ పార్టీ అభ్యర్థిగా ఉదయ్ నాగరాజు
నాగరాజుది ఉమ్మడి కరీంనగర్ జిల్లా శనిగరం
వరంగల్ వాయిస్, కోహెడ : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తెలుగు బిడ్డ ఎంపికయ్యా రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలుస్తునారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ కాండిడేట్ గా పార్టీ ప్రకటించింది. “నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ “బౌండరీకమిషన్ “సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కు లస్ పక్రారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్ లోనూ ఎన్నికల హడావిడి మొదలైంది. భారతదేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ -పాలస్తీనా సంఘర్షణ, పప్రంచవ్యా ప్తంగా ఆర్థిక మ...