MLC Elections 2025: పోలింగ్ ముగిసింది.. గెలిచేదెవరు..
మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరిదృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ..
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మార్చి3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను లెక్కిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు వెల్లడించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం...