ఆర్థిక శక్తిగా తెలంగాణ
అన్నిరంగాల్లో రాష్ట్రం పురోగమనం
దేశంలోనే అద్భత విజయం.. 24 గంటల విద్యుత్
అత్యధిక ధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నపూర్ణ
11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటు
మిషన్ భగీరథతలో వందశాతం గ్రామాలకు తాగునీటి సౌకర్యం
గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మువ్వెన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. వాడవాడనా సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ గోల్కొండలో సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించి, అనంతరం రాష్ట్ర ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సకల జనులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకున్...