Talasani Srinivas Yadav: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్
Talasani Srinivas Yadav: రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కులగణన సర్వే చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఈ సర్వేలో 60లక్షల మంది ఎక్కడకు పోయారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇప్పటికే పార్టీ మారిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కేడర్ చాలా హుషారుగా ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. కుట్ర పూరితంగా కులగణన సర్వే చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌తో సహా.. గ్రామాల్లో కూడా సర్వే సక్రమంగా జరుగల...