T PCC | రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తీన్మార్ మల్లన్న సస్పెండ్ : టీ పీసీసీ చీఫ్
T PCC | కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారికి ఇది ఒక హెచ్చరిక అని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఆ పార్టీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ...