MGU : హెచ్‌సీయూ భూములపై సుప్రీం స్టే.. ఎంజీయూలో విద్యార్థుల హర్షాతిరేకం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులపై నల్లగొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
వరంగల్ వాయిస్, నల్లగొండ విద్యా విభాగం (రామగిరి) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులపై నల్లగొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదిక వద్ద విద్యార్థులు స్వీట్లు పంపిణీ చేసుకుని ఆనందోత్సవం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. వ...