Supreme Court | ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఇప్పటి వరకు కోర్టు నుంచి తమకు నోటీసులు రాలేదని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రతివాదుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసిం...