Places of Worship Act: ప్రార్థనా స్థలాల చట్టం.. మధ్యంతర పిటీషన్లపై సుప్రీంకోర్టు అసహనం
Places of Worship Act : ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మధ్యంతర పిటీషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిటీషన్లకు ఓ పరిమితి ఉండాలని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఏప్రిల్‌లో ఈ కేసును మళ్లీ విచారించనున్నారు.
వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం(Places of Worship Act)పై ఇంకా పిల్స్ దాఖలు అవుతున్నాయి. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ కేసులు ఫైల్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేయడానికి ఓ పరిమితి ఉండాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం .. ప్రార్థన స్థలాల చట్టం అమలుపై వాదనలు చేపట్టింది. మధ్యంతర పిటీషన్లు ఎక్కువ కావడంతో ఇవాళ ఆ కేసును విచారణకు స్వీకరించలేమన్నారు. త్రిసభ్ ధర్మాసనం ముంద...
