Warangalvoice

Tag: Son-in-law who shot his aunt

అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు
Crime, District News, Hanamkonda, Latest News

అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు

అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆదప్రసాద్ గురువారం హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ప్రాంతానికి చెందిన తన అత్త కోమలను సర్విస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు. స్థానికులకు కథనం ప్రకారం.. ప్రసాద్ కు ఇవ్వవలసిన రూ.4 లక్షల విషయంలో గత కొంత కాలంగా అత్తా, అల్లుడి మధ్య వివాదం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం డబ్బుల విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన ప్రసాద్ తన సర్విస్ రివాల్వర్ తో అత్తపై కాల్పులు జరుపగా అమె అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీస్ ఇన్ స్పెక్టర్ అబ్బయ్య నేతృత్వంలో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు....