స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?
నగరంలో 121 ఏర్పాటుకు ప్రతిపాదనలునేటికీ ముందుకు పడని అడుగులుఇబ్బందులో ప్రజలుమొద్దునిద్రలో బల్దియా అధికారులు
రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు పాలకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు నీటి మూటలుగా మారుతున్నాయి. అధికారుల అలసత్వం, పాలకులు పట్టింపులేని తనంతో నగరం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి వెళ్తోంది. నగరంలో నూతనంగా చేపట్టాల్సిన ఎన్నో పథకాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదే బాటలో నగరంలో స్మార్ట్ బస్ షెల్టర్‌ల నిర్మాణ ప్రక్రియను కూడా బుట్టదాఖలు చేశారు. దీంతో పాతకాలపు నాటి బస్ షెల్టర్‌తోనే నగర ప్రజలు సర్దుకోవాల్సి వస్తోంది. నగరంలో మోడ్రన్ బస్ షెల్టర్‌ల నిర్మాణం ఎప్పుడు చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి న...