సీతారామ కళ్యాణం ..కమనీయం
వేదోక్తంగా భద్రాచలం సీతారామ కళ్యాణం
అభిజిత్ లగ్నంలో కళ్యావేడుకలు
పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి
చినజీయర్ స్వామి, దత్తాత్రేయ స్పీకర్ తమ్మినేని హాజరు
వరంగల్ వాయిస్,భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండువగా సాగింది. కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతువును వేదపండితులు నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. మిథులా స్టేడియం లోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీసీతారాములు కళ్యాణమండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా ...