Singareni | భారీ లక్ష్యసాధనలో సింగరేణి వెనుకంజ.. 70 మిలియన్ టన్నుల లక్ష్యసాధన అసాధ్యమే..!
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
వరంగల్ వాయిస్, గోదావరిఖని : రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. భారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యమైన 72 మిలియన్ టన్నులు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నించిన సింగరేణి చతికిల పడిపోయింది.
మార్చి 21 నాటికి సింగరేణి సంస్థలో 65.90 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం కేవలం పది రోజులు మిగిలి ఉండడం 10 రోజుల్లో 6.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు ప్రస్తుత మార్చి నెలలో యావరేజ్...