నేటినుంచి శ్రావణమాసం ఆరంభం
వ్రతాలు, నోములకు పెద్దపీటవరంగల్ వాయిస్, జూలై28 : తెలుగు మాసాల్లో ఐదో మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం వర్షఋతువులో వస్తుంది.. కనుక విరివిగా వర్షాలు కురుస్తాయి. ఈ నెల హిందువుల లోగిళ్ళు ఆలయాలను తలపిస్తాయి. విష్ణువు, లక్ష్మీదేవులకు అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం.. ఈ నెలలో మహిళలు వ్రతాలు, నోములు, పూజలను ఆచరిస్తారు. ఈ నెలలలో ఆచరించే పూజల వలన విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దల చెబుతారు. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు.. కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం.. ఈ నక్షత్రం పేరుతొ ఏర్పడిన శ్రావణమాసం అని.. ఈ మాసంలో చేసే పూజలు అత్యంత ఫలప్రదమని పురాణాల కథనం. లక్ష్మీ ప్రదమైన మాసం.. శ్రావణ మాసం ఈ ఏడాది జూలై 29 వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఆనందిస్తారు. తొలిరోజే శుక్రవారంతో ప్రారంభం కావడం విశేషం...