Warangalvoice

Tag: Show cause notice issued to Teenmar Mallanna

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ
Political

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ

తీన్మార్ మల్లన్నకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇటీవల పార్టీ వ్యతిరేక విధానాలు, నాయకత్వంపై చేసిన వ్యాఖ్యల కారణంగా జారీ అయ్యాయి. తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రభుత్వ కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలపై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాంటి వ్యాఖ్యలు పార్టీలో విభేదాలు తేవడంతోపాటు ఆందోళనలు కలిగిస్తాయని భావించి నిర్ణయం తీసుకుంది.అంతేకాదు మల్లన్నకు అధికారికంగా నోటీసులు జారీ చేయకముందే కాంగ్రెస్ పార్టీ నోటీసుల గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఏమైనా మీ సొంతమా, కాంగ్రెస్ పార్టీ బీసీలదంటూ వ్యాఖ్యానించారు. పార్టీ పేరుతో తనను బెదిరించాలని చూస్తే కుదరదని హె...