Rahul Gandhi | ఆయన కాంగ్రెస్ నేతగా కాదు.. యూట్యూబర్‌గా వచ్చారు.. రాహుల్ ధారావి పర్యటనపై విమర్శలు
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవలే ముంబైలోని ధారావిలో పర్యటించిన విషయం తెలిసిందే.
వరంగల్ వాయిస్, ధారావి : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవలే ముంబైలోని ధారావిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ధారావి పర్యటనపై శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఓ కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా యూట్యూబర్‌గా ఆ ప్రదేశాన్ని సందర్శించారంటూ వ్యాఖ్యానించారు.
‘రాహుల్ గాంధీ ముంబైకి కాంగ్రెస్ నాయకుడిగా రాలేదు. ఓ యూట్యూబర్‌గా వచ్చి ధారావిని సందర్శించారు. అక్కడ వీడియోలు తీసుకొని వెళ్లిపోయారు’ అంటూ వ్యాఖ్యానించారు. ముంబై కాంగ్రెస్ పార్టీ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నప్పటికీ స్థానిక నేతలను కలవకుండానే రాహుల్ తిరిగి వెళ్లిపోయారని విమర్శించారు. ‘ముంబై కాంగ్రెస్ పరిస్థి...