నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్
ఏ విద్యార్హత లేకున్నా వైద్యంనకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులువివరాలు వెల్లడించిన సీపీ డా. తరుణ్ జోషి
వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ నగరంలో ఏలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతడి సహాయకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నకిలీ డాక్టర్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్ ట్యాప్, మూడు సెల్‌ఫోన్లు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ నగరానికి చెందిన ముజతాబా ఆహ్మద్, మరో నిందితుడు దామెరకొండ సంతోష కుమార్ వున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ముజతాబా ఆహ్మద్ బి.ఫార్మసీ చదువు మధ్యలో అపివేసి స్థానికంగా వున్న డాక్టర్ వద్ద సహాయకుడిగా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. నిందితుడు అహ్మద్ సహాయకుడి...
