Warangalvoice

Tag: satyavarhi rathod

మాడిన అన్నం.. గొడ్డు కారం..
Mahabubabad, Today_banner

మాడిన అన్నం.. గొడ్డు కారం..

ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో ఆహారం తినలేక పస్తులుంటున్న విద్యార్థులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీతో వెలుగులోకి మన బిడ్డలకు ఇలాగే పెడతామా అంటూ నిలదీత సాక్షాత్తు కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం నిత్యం సంచరించే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలోని విద్యార్థినులకు మాడిన అన్నం..గొడ్డు కారమే దిక్కైంది. తింటే తిను లేకుంటే పస్తులుండు అన్నట్లుగా అక్కడి వార్డెన్లు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఒకవైపు విద్యార్థులకు మెరుగైన భోజనం వడ్డిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అది అమలుకు నోచుకోవడం లేదు. కలెక్టర్లు గురుకులాలను నెలకోసారి విజిట్ చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. కలెక్టర్లు, ఇతర అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వస్తున్నారని ముందే తెలుసుకుంటున్న గురుకులం నిర్వాహకులు ఆ ఒక్క పూట మాత్రం విద్...