‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి
ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీపార్టీ బలోపేతమే లక్ష్యంఆగస్టు 2నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్రయాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధినుంచి ప్రారంభం26న వరంగల్‌లో భారీ ముగింపు సభహాజరుకానున్న బీజేపీ చీఫ్ నడ్డా
ఓరుగల్లుపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత పాదయాత్రను మొదట వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధినుంచే ప్రారంభించి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ముగించాలని భావించినా చివరి నిమిషంతో షెడ్యూల్ మారింది. పాదయాత్రను యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ఆగస్టు 2వ తేదీన ప్రారంభించి అదే నెల 26న వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ముగించేలా ప్లాన్ చేశారు. ముగింపు సందర్భంగా కనీ వినీ ఎరుగని రీతిలో భ...