పెండింగ్ పనులు పూర్తి చేయండి.. టీఎస్ఆర్ఎస్‌సీఎల్ డైరెక్టర్‌కు వినతిపత్రం
Pending Works: సద్భావన టౌన్‌షిప్ బీ బ్లాక్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. బోర్లు వేయాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో ఉన్న సద్భావన టౌన్‌షిప్ బీ బ్లాక్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. బీ బ్లాక్‌లో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. టౌన్‌షిప్‌లోని బీ బ్లాక్ లో తీవ్ర నీటి కొరత ఉన్నదని, ఈ నేపథ్యంలో బోర్లు వేయాలని కోరారు. గతంలోనూ ఈ అంశం గురించి ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి మార్పు జరగలేదని వినతిపత్రంలో తెలిపా...