పేపర్ లీకులో అధికార పార్టీ నేతలు
కెటిఆర్ కుసన్నల్లోనే వ్యవహారం
బిజెఇఐఎం కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు
మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
వరంగల్ వాయిస్,హైదరాబాద్: టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీపై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. ఉండటం వేస్టని, వెంటనే కేటీఆర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినవాళ్లంతా బీఆర్‌ఎస్ కార్యకర్తలేనని, వాళ్లందరూ ఎదో ఒక పదవితో సంబంధం ఉన్నవాళ్లేనని తెలిపారు. ఈ ఘటనలో కారణం అయిన నిందితులను బీఆర్‌ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అరెస్టయిన కార్యకర్తలను పరామర్శించడానికి గురువారం చంచల్ గూడ సెంట్రల్ జైల్ కు వెళ్లిన బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలో నిరు...
