Warangalvoice

Tag: Rulers as monsters in the hands of farmers!

రైతుల పాలిట రాక్షసులుగా పాలకులు !
Latest News, Telangana

రైతుల పాలిట రాక్షసులుగా పాలకులు !

వరంగల్ వాయిస్, కామారెడ్డి : కామారెడ్డి ఆందోళన రైతుల ఆక్రందనకు అద్దంపట్టే చర్య. ఇప్పుడు కామారెడ్డి ఒక్కటే కాదు... ఇంతకు ముందు మల్లన్న సాగర్‌,కొండపోచమ్మ సాగర్‌...ఫార్మాసిటీ, పోలవరం..అమరావతి, విశాఖ ఉక్కు, గంగవరం పోర్టు... ఇలా చెప్పుకుంటే పోతే అనేక చోట్ల ప్రభుత్వాల దౌర్జన్యం కనిపిస్తుంది. దోపిడీదారులుగా మారిన పాలకులు రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకుని వ్యాపారం చేస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. అభివృద్ది అన్న అందమైన పేరు చూపి భూములను గుంజుకుని బక్కరైతులను బజారున పడేస్తున్న తీరు నిరంకుశ పాలనకు సాక్ష్యంగా చూడాలి. ఎంతగా అంటే వారికి ముష్టి డబ్బులు వేసి భూములను గుంజుకుంటున్న తీరు కళ్లముందు కనబడుతున్నది. రైతులు ఆక్రందనతో ఆందోళన చేస్తుంటే పోలీస్‌ బలగాలతో వారిని అణచివేస్తున్నారు. ఇళ్లను కూడా గుంజుకుని వారిని తన్ని తరిమేస్తున్న తీరు దౌర్జన్యానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. ఎకరా 50 లక్షలు పలుకుతోంద...